22 October 2008

ఈ బ్లాగ్ లో comments section ఎందుకు లేదు?

నాకు రెగ్యులర్ గా రాయడానికే బధ్ధకం.. ఇంక కామెంట్స్ కూడా తగిలించుకున్నానంటే అదొక baggage అయిపోతుంది. ఏదో సరదాకి రాసే రాతలకి కాంప్లిమెంట్స్, సజెషన్స్ కూడానా? ఇంకో రహస్యమేంటంటే, కామెంట్స్ లేనంత వరకు నా బ్లాగ్ అచ్చంగా నాదే. కామెంట్స్ సెక్షన్ ని ఓపెన్ చేసాననుకోండి, partnership వచ్చి పడుతుంది చదివే వాళ్ళతో... చదివి ఊరుకోరు కదా? వాళ్ళేదో చెప్తారు, దానికి నేనేదో చెప్పాలి. నువ్వు రాసిన ఈ ముక్క రైటు కాదంటారు. నా అభిప్రాయాల మీద ఒక డిస్కషన్. అప్పుడు నన్ను నేను సమర్ధించుకోవాలి. ఇలాంటి గొడవలు చాలా ఉంటాయి. పబ్లిక్ పర్సనాలిటీల బతుకు లాగా నా బ్లాగ్ బతుకు బస్ స్టాండవుతుంది. అందుకని నా బధ్ధకం ప్రసాదించిన ముందుచూపుతో కామెంట్స్ సెక్షన్ని తీసేసి సుఖపడుతున్నానన్న మాట.