గుప్పిట్లో పెట్టుకుని తిరగడం ఎక్కువయ్యింది
నెలంతా పోగుచేసుకున్న చిల్లరంతా
గుప్పిట్లో పెట్టుకుని సినిమాకెళ్ళే పిల్లాడిలా
ఎక్కడ జారి పడిపోతాయో అని ఒకటే బెంగ
గుప్పిలి బిగించినప్పుడల్లా అరచేతిలో కొత్త గీతలు
నవ్వుల రేఖలు, మాటల రేఖలు
నువ్వెప్పుడో ఇటువైపు వస్తావుగా?
అప్పుడు చూద్దువు గాని ఈ రేఖలని
నా అరచేతి అద్దంలో నీకు నిన్నే చూపెడతాయవి
జాగ్రత్తగా విన్నావంటే నా గుప్పిట్లో రేఖలు
నవ్వినట్టు వినపడుతుంది కూడా